విశ్రాంత ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ప్రధానాంశాలు

విశ్రాంత ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.వెంకట్రామిరెడ్డికి గురువారం సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సీబీఐ, ఈడీలు నమోదు చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డిగానీ, అతని తరఫు న్యాయవాదులుగానీ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. ఈ కేసుల విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తూ అదే రోజు వెంకట్రామిరెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చింది.

ఓఎంసీ కేసులో వి.డి.రాజగోపాల్‌కు వారెంట్‌.. ఉపసంహరణ
ఓఎంసీ కేసులో నిందితుడైన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌కు గురువారం సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కేసు విచారణ సందర్భంగా రాజగోపాల్‌గానీ, ఆయన తరఫు న్యాయవాదిగానీ హాజరుకాకపోవడంతో వారెంట్‌ జారీ అయింది. ఈ విషయం తెలిసిన రాజగోపాల్‌ సాయంత్రం సీబీఐ కోర్టు ముందు హాజరై రూ.5 వేల వ్యక్తిగత హామీ సమర్పించడంతో వారెంట్‌ను ఉపసంహరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లలో రాతపూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ గడువు కోరడంతో విచారణను 30కి వాయిదా వేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని