తితిదే ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల విరాళం

ప్రధానాంశాలు

తితిదే ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: అమెరికా బోస్టన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుడు రవి ఐకా ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా రూ.4.20 కోట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన తరఫున విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్‌ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ముందుగా దాత ప్రతినిధి శ్రీవారి మూలమూర్తిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. రవి ఐకా ఇప్పటికే తితిదేకు చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారని, ప్రస్తుతం తొలి విడతగా రూ.4.20 కోట్లు ఇచ్చారని వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని