త్వరలో 430 వైద్యపోస్టుల భర్తీకి ప్రకటన

ప్రధానాంశాలు

త్వరలో 430 వైద్యపోస్టుల భర్తీకి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఏడాది(2022-23) వైద్యవిద్య సంవత్సరానికి అందుబాటులోకి రానున్న 8 కొత్త వైద్యకళాశాలల్లో పోస్టుల భర్తీకి త్వరలో నియామక ప్రకటన వెలువడనుంది. మొత్తంగా 430 వైద్య పోస్టులను అఖిల భారత స్థాయిలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టులున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కొత్త వైద్యకళాశాలలకు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులివ్వగా.. త్వరలోనే రామగుండంలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు కూడా పోస్టులను మంజూరు చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఒక్కో కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున మొత్తం 8 కళాశాలల్లో 1,200 సీట్లు వచ్చే ఏడాదికి అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 22, 23 తేదీల్లో జాతీయ వైద్య కమిషన్‌కు 8 కళాశాలలను నెలకొల్పడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేయనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని