కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన

ప్రధానాంశాలు

కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన

ఈనాడు, హైదరాబాద్‌: వేతనాల విషయంలో ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు అధ్యాపకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆదాయపు పన్ను కింద కోత విధించకుండా జూన్‌, జులై వేతనాలను వెంటనే అందజేయాలని కోరారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు, జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వరంగల్‌లో ఆర్‌జేడీ జయప్రదబాయికి వినతిపత్రం అందజేశారు. ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో జయశంకర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపి విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నేతలు కొప్పిశెట్టి సురేష్‌, వి.శ్రీనివాస్‌, కేపీ శోభన్‌బాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని