రాజకీయాలకు అతీతంగా ‘దళితబంధు’: మంత్రి అజయ్‌

ప్రధానాంశాలు

రాజకీయాలకు అతీతంగా ‘దళితబంధు’: మంత్రి అజయ్‌

చింతకాని, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ ‘దళిత బంధు’ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా చింతకానికి రూ.500 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ రాజకీయాలకు అతీతంగా లబ్ధి చేకూరుతుందన్నారు. దళితబంధు పథకం ముఖ్యమంత్రి ఆలోచనల్లో నుంచి వచ్చిందని.. ఇది ఎవరి సూచనలు, సలహాలతో ఏర్పాటు చేసింది కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి మంత్రి పరోక్షంగా విమర్శించారు. ‘దళితబంధు’ పేరు చెప్పి పార్టీలు మారాలని అడిగే దుస్థితి తెరాసకు లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని