స్వయంగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తా

ప్రధానాంశాలు

స్వయంగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తా

పంట మార్పిడిని ప్రోత్సహించాలి

వ్యవసాయశాఖ సమీక్షలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: వరికి ప్రత్యామ్నాయం.. పంటల మార్పిడితో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతులను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. యాసంగి నుంచి దొడ్డు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పిందని, రైతులు సన్నరకాల సాగుతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసేలా క్లస్టర్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో యాసంగి పంటల మార్పిడిపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఈ జిల్లా ఆయిల్‌పాం సాగుకు అనుకూలమైందని.., వచ్చే ఏడాది నుంచి ముస్తాబాద్‌ మండలం మోహినికుంటలో 15 ఎకరాల భూమి తీసుకుని స్వయంగా ఆయిల్‌పాం సాగు చేస్తానని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక్కడి రైతుల్ని అశ్వారావుపేటలో ఆయిల్‌పాం సాగుపై క్షేత్రపర్యటనకు తీసుకెళ్లాలని అధికారులకు చెప్పారు. కొండాపూర్‌కు చెందిన చంద్రశేఖర్‌ తాను పండించిన నల్ల వరి ధాన్యాన్ని మంత్రికి అందజేశారు. సన్నరకాలు, చిరుధాన్యాల సాగు పెరిగితే జిల్లాలో ప్రత్యేక మార్కెటింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో ఫిర్యాదులకు క్యూఆర్‌ కోడ్‌ను మంత్రి ఆవిష్కరించారు. 91000 69040 నంబరుకు వాట్సప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని