బీఐఎస్‌ పాలకమండలిలో రాష్ట్రానికి చోటు

ప్రధానాంశాలు

బీఐఎస్‌ పాలకమండలిలో రాష్ట్రానికి చోటు

ఈనాడు, దిల్లీ: తెలంగాణ ప్రభుత్వంలో నాణ్యతా నియంత్రణ, ప్రమాణాలు చూసే మంత్రికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) పాలకమండలిలో స్థానం కల్పించారు. వచ్చే రెండేళ్లకాలానికి కొత్తపాలకమండలిని ఏర్పాటుచేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో మొత్తం 23 మందికి స్థానం కల్పించింది. అందులో 5 రాష్ట్రాలకు చెందిన మంత్రులుండగా తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో ఈ బాధ్యతను పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నిర్వహిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని