రక్తం పంచి ఇచ్చినా.. పెంచలేని దైన్యమా!

ప్రధానాంశాలు

రక్తం పంచి ఇచ్చినా.. పెంచలేని దైన్యమా!

20 రోజుల పసికందును వదిలివెళ్లిన వైనం

దేవరకద్ర, న్యూస్‌టుడే: ఏ తల్లి కన్నబిడ్డో.. ఆ మాతృమూర్తికి ఎలాంటి కష్టమొచ్చిందో.. 20 రోజుల పసిపాపకు కడుపునిండా పాలిచ్చి, కొత్త దుస్తులు వేసి బేబీ కవర్‌లో పడుకోబెట్టి ఓ ధాబా ఎదుట వదిలి వెళ్లింది. ఈ సంఘటన మహబూబ్నగర్‌ జిల్లాలోని దేవరకద్ర మండలంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని చౌదర్‌పల్లి వద్ద 167వ జాతీయ రహదారి పక్కనున్న ధాబా ముంగిట దాని యజమాని ఉదయం 9.30 గంటలకు ఓ పసికందును చూశారు. పరిసరాల్లో ఎవరూ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై భగవంత్‌రెడ్డి అక్కడికి చేరుకుని పసిబిడ్డను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యాధికారిణి షబానాబేగం పరీక్షలు నిర్వహించి పాప ఆరోగ్యంగానే ఉందని నిర్ధరించారు. అనంతరం ఆ పసికందును స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించగా.. వారు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తరలించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని