ఎంసెట్‌ సీటు రద్దు గడువు పొడిగింపు

ప్రధానాంశాలు

ఎంసెట్‌ సీటు రద్దు గడువు పొడిగింపు

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ మొదటి విడతలో బీటెక్‌, బీఫార్మసీ సీట్లను పొందిన విద్యార్థులు అక్టోబరు 13 లేదా చివరి విడత కౌన్సెలింగ్‌ మొదలయ్యే నాటి వరకు తమ సీట్లను రద్దు చేసుకోవచ్చు. ఈ మేరకు గడువును పొడిగిస్తూ ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ‘ఎంసెట్‌ సీటా.. ఐఐటీ వైపా?’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కమిటీ గడువును పొడిగించింది. అంటే చివరి విడత కౌన్సెలింగ్‌ మొదలయ్యే వరకు సీటును రద్దు చేసుకున్నా చెల్లించిన పూర్తి ఫీజు తిరిగి విద్యార్థులకు అందుతుంది. వచ్చే నెల 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరగనున్నందున 13వ తేదీ నాటికి వాటి ఫలితాలు వస్తాయని అంచనా వేసుకున్న అధికారులు ఆ మేరకు గడువు పొడిగించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని