కృత్రిమ మేధతో రైతులకు సలహాలు, సూచనలు

ప్రధానాంశాలు

కృత్రిమ మేధతో రైతులకు సలహాలు, సూచనలు

‘వింగ్‌స్యూర్‌’తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: కృత్రిమ మేధ పరిజ్ఞానంతో తెలంగాణలోని రైతులకు బీమా, శిక్షణ, సలహా సేవలు, సమాచార సేకరణ, ఇతర కార్యకలాపాల నిర్వహణ, పంటల సాగు, శీతోష్ణస్థితి సూచనలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వింగ్‌స్యూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, వింగ్‌స్యూర్‌ వ్యవస్థాపకులు, సీఈవో అవి బసులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ తరహా ఒప్పందాల్లో ఇది దేశంలోనే మొదటిదని జయేశ్‌రంజన్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని