శిథిల భవనంలో చికిత్సలు.. ఆరుబయట పరీక్షలు

ప్రధానాంశాలు

శిథిల భవనంలో చికిత్సలు.. ఆరుబయట పరీక్షలు

సూర్యాపేట జిల్లా మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరింది. భవనం గోడలపై చెట్లు పెరగడంతో ఆసుపత్రి పైకప్పు శిథిÅలమై కూలిపోతోంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ వారికి ట్రావెలింగ్‌ బంగ్లా (విడిది భవనం)గా ఉండేది. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు. జాతీయ రహదారి పక్కనే ఉండే ఈ ఆసుపత్రిలో రోజూ 150 మందికి ఓపీ సేవలు అందుతాయి. పైకప్పు నుంచి ఎప్పుడు ఏ పెంకు కూలి మీద పడుతుందోనని వైద్యులు, సిబ్బంది భయంభయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆసుపత్రిలో 10 పడకలున్నా భవనం దుస్థితి కారణంగా ఇన్‌పేషంట్‌లకు సేవలు అందించలేకపోతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారుతోంది. భవనంలో ఒకే గది అందుబాటులో ఉండటంతో కరోనా, ఇతర పరీక్షలకు నమూనాలను ఆరుబయటే సేకరిస్తున్నారు. పదుల సంఖ్యలో గ్రామాల్లోని పేదలకు వైద్యసేవలు అందిస్తున్న ఆసుపత్రి బాగోగుల గురించి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.

-ఈనాడు, సూర్యాపేట


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని