టీఎస్‌ ఐసెట్‌లో 90.09 శాతం ఉత్తీర్ణత

ప్రధానాంశాలు

టీఎస్‌ ఐసెట్‌లో 90.09 శాతం ఉత్తీర్ణత

ఎన్జీవోస్‌కాలనీ (హనుమకొండ), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2021 ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, మాజీ ఛైర్మన్‌ టి.పాపిరెడ్డి, కేయూ ఉపకులపతి ఆచార్య టి.రమేష్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి పాల్గొని ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఐసెట్‌ పరీక్షకు 66,034 మంది నమోదు చేసుకోగా 56,962 మంది హాజరయ్యారన్నారు. వీరిలో 51,316 మంది (90.09 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాకు చెందిన ఆర్‌.లోకేష్‌, పి.సాయితనూజ మొదటి, రెండో ర్యాంకులను, మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఆర్‌.నవీనక్షాంత, టి.రాజశేఖర చక్రవర్తి మూడు, నాలుగో ర్యాంకులను, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన పి.ఆనంద్‌పాల్‌ అయిదో ర్యాంకును సాధించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని