వేడి నీటితో విద్యుదుత్పత్తి

ప్రధానాంశాలు

వేడి నీటితో విద్యుదుత్పత్తి

6 నెలల్లో పగిడేరు వద్ద ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు

హైదరాబాద్‌-గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణి సంస్థ వేడి నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేసే జియో థర్మల్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. మరో ఆరు నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పగిడేరు వద్ద వేడి నీటి(జియో థర్మల్‌) విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ గురువారం వెల్లడించారు. దీని ఏర్పాటుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ద్వారా రూ.1.72 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి సంస్థ అధికారులు ఇటీవలనే దీని ఏర్పాటు అంశంపై శ్రీరామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కేంద్రం ద్వారా 20 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. మార్చి 30వ తేదీ నాటికి విద్యుత్తు ఉత్పత్తి చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని