తెలుగు వర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ప్రధానాంశాలు

తెలుగు వర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. పీహెచ్‌డీ, ఎంఫిల్‌తో పాటు హైదరాబాద్‌లో బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ (శిల్పం-చిత్రలేఖనం, ప్రింట్‌ మేకింగ్‌), ఎంఏ (తెలుగు, అనువర్తిత భాషాశాస్త్రం చరిత్ర, టూరిజం, కర్ణాటక సంగీతం, జర్నలిజం), ఎంపీఏ (కూచిపూడి/ఆంధ్రనాట్యం, జానపద, రంగస్థల కళలు), ఎంఏ జ్యోతిషం, వివిధ లలిత కళల్లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌, ప్రాథమిక, ప్రవీణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాజమహేంద్రవరంలో ఎంఏ (తెలుగు), శ్రీశైలంలో ఎంఏ (చరిత్ర, పురావస్తు శాస్త్రం), కూచిపూడిలో ఎంపీఏ (కూచిపూడి నృత్యం), వరంగల్‌లో రెండేళ్ల కాలవ్యవధితో పేరిణి నృత్యంలో విశారద కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ అక్టోబరు 11గా నిర్ణయించినట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ తెలిపారు. పూర్తి వివరాలను ‌www.teluguuniversity.ac.in లేదా ‌www.pstucet.org లలో చూడాలని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని