కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టాలి

ప్రధానాంశాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టాలి

గవర్నర్‌కు మాజీ ఎంపీ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో మునిగిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించేలా చూడాలని గవర్నర్‌ తమిళిసైకి భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జి.వివేక్‌వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆయన గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం వివేక్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం విఫల ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మంజూరు చేయించారని, తెరాస ప్రభుత్వం కమిషన్ల కోసం అంచనాలను పెంచిందని ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని