ఉద్యోగాలు... లేదా కారుణ్య మరణాలు!

ప్రధానాంశాలు

ఉద్యోగాలు... లేదా కారుణ్య మరణాలు!

హక్కుల కమిషన్‌కు గురుకుల పీఈటీ అభ్యర్థుల వినతి

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్ని గౌరవిస్తూ గురుకులాల్లో పీఈటీ ఉద్యోగాలిచ్చి జీవితాలను నిలబెట్టండి.. లేకుంటే కారుణ్య మరణాలకైనా అనుమతివ్వండి’ అంటూ గురుకుల పీఈటీ అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)కి శనివారం విన్నవించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో పీఈటీ పోస్టుల కోసం 2017 ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2018 మేలో ధ్రువపత్రాలు పరిశీలించగా.. అర్హత సాధించని అభ్యర్థులు కొందరు హైకోర్టుకు వెళ్లడంతో నియామకాలను నిలిపివేశారు. 2021 మార్చిలో కేసు పరిష్కారమైంది. ఎంపికైన అభ్యర్థులందరికీ మూడు వారాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆదేశాలు వచ్చి ఆరు నెలలైనా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడగా.. శుక్రవారం మరో అభ్యర్థి శ్రీనాథ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వాపోయారు. వారం, పది రోజుల్లో పోస్టింగ్‌లు ఇవ్వకపోతే సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని వారు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని