బతుకమ్మ సంబరాలకు పనివేళలు సడలించాలి

ప్రధానాంశాలు

బతుకమ్మ సంబరాలకు పనివేళలు సడలించాలి

టీఎన్జీవో, టీజీవోల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో అతి పెద్ద పండుగైన బతుకమ్మ ఉత్సవాల్లో ప్రభుత్వ ఉద్యోగినులు, అధికారిణులు పాల్గొనేందుకు వీలుగా కార్యాలయాల పనివేళల్లో మధ్యాహ్నం రెండు నుంచి అయిదు గంటల వరకు సడలింపు ఇవ్వాలని టీఎన్జీవో, టీజీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, మమత, రాయకంటి ప్రతాప్‌, సత్యనారాయణ తదితరులు సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. శనివారం మంత్రిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని