33 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్ల జారీ

ప్రధానాంశాలు

33 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్ల జారీ

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే మొదటిసారిగా ఆన్‌లైన్‌లో విడుదల చేసిన శ్రీవారి సర్వదర్శనం టికెట్లన్నింటినీ భక్తులు కేవలం 33 నిమిషాల్లోనే పొందారు. ఈనెల 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల చొప్పున మొత్తం 2.79 లక్షల టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు తితిదే వెబ్‌సైట్‌, యాప్‌లో విడుదల చేశారు. తితిదే ఐటీ విభాగం, టీసీఎస్‌, జియో సంస్థ క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో భక్తులు అతి తక్కువ సమయంలో సులభంగా టికెట్లను నమోదు చేసుకున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని