ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్న కేంద్రం: ఐద్వా

ప్రధానాంశాలు

ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్న కేంద్రం: ఐద్వా

సూర్యాపేట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య విమర్శించారు. సూర్యాపేటలో ఐద్వా మూడో రాష్ట్ర మహాసభల్లో భాగంగా శనివారం రెండో రోజు నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు. కేంద్రం మహిళా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు గత 25 ఏళ్లుగా పార్లమెంటులో మూలుగుతుండటం దారుణమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై మరో సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని