రామగుండం ప్రభుత్వ వైద్యకళాశాలకు పరిపాలన అనుమతులు

ప్రధానాంశాలు

రామగుండం ప్రభుత్వ వైద్యకళాశాలకు పరిపాలన అనుమతులు

ఎనిమిది కాలేజీల ఏర్పాటుకు సర్కారు దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఏడాదికి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జాతీయ వైద్యవిద్య కమిషన్‌కు దరఖాస్తు చేసింది. ఇప్పటికే ఏడు కళాశాలలకు పరిపాలన అనుమతులు ఇవ్వగా... శనివారం రామగుండం ప్రభుత్వ వైద్యకళాశాలకు ఇచ్చింది. సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల, రామగుండంలలో ఈ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. 2022-23 విద్యాసంవత్సరం నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయని, రాష్ట్రానికి అదనంగా 1200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని