గీత వృత్తిదారులకు లైసెన్స్‌లు సులభతరం

ప్రధానాంశాలు

గీత వృత్తిదారులకు లైసెన్స్‌లు సులభతరం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గీత వృత్తిదారులకు టీఎఫ్‌టీ, టీసీఎస్‌ లైసెన్స్‌ల జారీ నిబంధనను సులభతరం చేయాలని ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను ఆదేశించారు. ఈ విషయంపై శనివారం మంత్రి హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు లైసెన్స్‌ల జారీ ప్రక్రియలో దరఖాస్తులు జిల్లా కలెక్టర్‌ ద్వారా ఆబ్కారీ కమిషనర్‌కు వస్తున్నాయన్నారు. ఉన్నతాధికారులపై ఉన్న అధిక పనిభారం కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో జిల్లా స్థాయిలోనే ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్లకు లైసెన్స్‌ల జారీ అధికారాన్ని బదలాయించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌ను ఆబ్కారీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపించామన్నారు. తాటి, ఈత చెట్లపైనుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం పాలైన గీతకార్మికులు నష్టపరిహారం పొందడానికి ప్రస్తుతమున్న నిబంధనలను సవరించి సులభతరం చేయాలని ఆదేశించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని