వృద్ధురాలికి ఒకేసారి రెండు టీకా డోసులు

ప్రధానాంశాలు

వృద్ధురాలికి ఒకేసారి రెండు టీకా డోసులు

ఏఎన్‌ఎం నిర్లక్ష్యం ఫలితం

చంద్రుగొండ, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలో ఓ వృద్ధురాలి రెండు చేతులకు రెండు డోసుల కొవిడ్‌ టీకాలు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోకలగూడెంలో శుక్రవారం కొవిడ్‌ టీకాల కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి చెందిన బానోత్‌ సక్రి(70) టీకా కోసం రాగా ఆమెకు ఏఎన్‌ఎం సునీత తొలిడోసు వేశారు. అనంతరం వృద్ధురాలు అక్కడకు సమీపంలో కూర్చోగా అదే సమయంలో సునీతకు ఫోన్‌ రావడంతో మాట్లాడింది. తర్వాత సక్రిని రమ్మని మళ్లీ రెండోసారి టీకా వేసింది. వృద్ధురాలు శుక్రవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. పీహెచ్‌సీ వైద్యాధికారి రాకేష్‌ని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా వృద్ధురాలికి ఏమీ కాదని.. ఏఎన్‌ఎం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అవసరమైతే మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని