ఏపీలో కొలువుదీరిన కొత్త జడ్పీ ఛైర్మన్లు

ప్రధానాంశాలు

ఏపీలో కొలువుదీరిన కొత్త జడ్పీ ఛైర్మన్లు

ఈనాడు-అమరావతి: ఏపీలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయించారు. మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికల్లో సొంత పార్టీలో ఎంపీటీసీ సభ్యుల నుంచి అసమ్మతి తలెత్తడంతో జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక సజావుగా సాగేలా మంత్రులు జాగ్రత్తలు తీసుకున్నారు. 13 జిల్లాల్లోనూ అధిష్ఠానం నిర్ణయించిన వ్యక్తులే జడ్పీ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్ల పదవులకు ఎక్కువ మంది పోటీపడిన చోట కూడా జిల్లా మంత్రులు జోక్యం చేసుకున్నారు.  కొత్తగా ఎన్నికైన ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల పదవీకాలం శనివారం నుంచి ప్రారంభమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని