మోకాళ్లతో నడిచి వచ్చి ఎస్పీబీకి ఘన నివాళి

ప్రధానాంశాలు

మోకాళ్లతో నడిచి వచ్చి ఎస్పీబీకి ఘన నివాళి

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌ గచ్చిబౌలికి చెందిన శాంతిరాజు అనే వీరాభిమాని ఎస్పీబీ పాడిన తనకు ఇష్టమైన పాటలను కాగితాలపై రాసి మాలగా ధరించారు. ప్రధాన రహదారినుంచి అర కిలోమీటరు వరకు మోకాళ్లపై నడుస్తూ వచ్చి బాలు స్మారకమందిరం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు ఎస్పీబీ స్మారకమందిరం వద్ద కుటుంబీకులు, అభిమానులు ఘననివాళులు అర్పించారు. తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా పెరియపాళ్యం సమీపం తామరైపాక్కంలోని ఫాంహౌస్‌లో ఎస్పీబీ స్మారక మందిరం ఉంది. ఎస్పీబీ కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, కొందరు అభిమానులను మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు.

-న్యూస్‌టుడే, పెరియపాళ్యం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని