భూదాన్‌పోచంపల్లి చేనేతలకు జాతీయ అవార్డులు!

ప్రధానాంశాలు

భూదాన్‌పోచంపల్లి చేనేతలకు జాతీయ అవార్డులు!

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ అవార్డులకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి వాసులు తడ్క రమేష్‌, సాయిని భరత్‌ ఎంపికయ్యారు. చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర సర్కారు సంత్‌ కబీర్‌ అవార్డు, నేషనల్‌ అవార్డు, నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ అవార్డు, కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డులను అందజేస్తుంది. ఈ నేపథ్యంలో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌, డిజైన్‌ అభివృద్ధి విభాగాల్లో తాము అవార్డులకు ఎంపికైనట్లు సమాచారం అందిందని తడ్క రమేష్‌, భరత్‌లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని