ఖమ్మం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

ప్రధానాంశాలు

ఖమ్మం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

వేంసూరు, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ఆదివారం వేకువజామున రెండు విడతలుగా కొన్ని సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 5.18 గంటలకు ఒకసారి, 5.25కు మరోసారి ప్రకంపనలను గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. మండలంలోని లింగపాలెం, వేంసూరు, మర్లపాడు, లచ్చన్నగూడెం, కందుకూరు, అమ్మపాలెం, చౌడవరం తదితర గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించిందని, దీనిపై కలెక్టరేట్‌కు సమాచారం ఇచ్చామని తహసీల్దారు ముజాహిద్‌ తెలిపారు. ఇతర వివరాలు వెల్లడికాలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని