నేటి నుంచి సభలో ప్రశ్నోత్తరాలు

ప్రధానాంశాలు

నేటి నుంచి సభలో ప్రశ్నోత్తరాలు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ, మండలిలో సోమవారం నుంచి సాధారణ కార్యకలాపాలు సాగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం, బీఏసీ సమావేశం నిర్ణయాల నివేదికను ప్రవేశపెడతారు. గృహ నిర్మాణ మండలి సవరణ బిల్లు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, జాతీయ న్యాయ విద్య, పరిశోధన విశ్వవిద్యాలయ సవరణ బిల్లులను మంత్రులు సభ ముందుంచుతారు. అనంతరం పరిశ్రమలు, ఐటీ రంగాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. శాసనమండలిలోనూ ప్రశ్నోత్తరాలు జరుగుతాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని