ఆర్టీసీలో దుబారా అరికడతాం: బాజిరెడ్డి

ప్రధానాంశాలు

ఆర్టీసీలో దుబారా అరికడతాం: బాజిరెడ్డి

ఈనాడు, నిజామాబాద్‌: ఆర్టీసీలో దుబారాను అరికట్టి నష్టాలు తగ్గించేందుకు చర్యలు చేపడతామని ఆ సంస్థ ఛైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కరోనాతో ఆదాయం పడిపోవడంతో పాటు పెరిగిన డీజిల్‌ ధరలు సంస్థకు భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం సరికాదు. సంస్థను మూసేయడం గానీ, ప్రైవేటీకరణ కానీ చేయబోం. కొవిడ్‌ కాలంలో పక్కనున్న రాష్ట్రాల్లో మూడు నెలలు జీతాలే ఇవ్వలేదు. ఆలస్యంగానైనా మన వద్ద చెల్లించాం. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలకు రాత్రి పూట వెళ్లే బస్సులు తిరిగి ఉదయం 5 గంటలకే ప్రయాణికులు లేకుండా పట్టణాలకు చేరుకుంటున్నాయి. దీంతో నష్టాలు వస్తున్నాయి.కార్గో సేవలకు  మరికొన్ని సర్వీసులను వినియోగించాలని ఆలోచిస్తున్నాం’’ అని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని