వాహన వేగంపై ఏఐ

ప్రధానాంశాలు

వాహన వేగంపై ఏఐ

చిత్రాల్లో మీరు చూస్తున్నది ట్రాఫిక్‌లో వేగ నియంత్రణకు ఉద్దేశించిన ఆధునిక పరికరం.. ఇది కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సహకారంతో పనిచేస్తుంది. కదులుతున్న వాహన వేగాన్ని కచ్చితంగా లెక్కించి.. అక్కడి నిబంధనలకు లోబడి ఉందా లేదా అనే సమాచారాన్ని ట్రాఫిక్‌ అధికారులకు చేరవేస్తుంది. సౌరశక్తితో పనిచేసే ఈ పరికరాన్ని సికింద్రాబాద్‌ సమీప మెట్టుగూడ వద్ద ప్రయోగాత్మకంగా అమర్చారు. ఇక్కడ వాహనాల వేగం 40 కి.మీ. మించరాదు. కానీ, ఏదైనా బండి ఆ పరిమితిని మించితే వెంటనే ఎరుపు రంగులో ‘గో స్లో’ (నెమ్మదిగా వెళ్లు) అన్న హెచ్చరిక వస్తుంది. వాహన వేగమూ పరికరంపై కనిపిస్తుంది. వేగ పరిమితిని పాటిస్తూ వెళ్తున్నపుడు మాత్రం ఆకుపచ్చ రంగులో ‘థాంక్‌ యూ’ అంటూ కృతజ్ఞతలు ప్రదర్శిస్తుందీ పరికరం..

- ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని