సోయా పంటకు నష్టాల మొలకలు!

ప్రధానాంశాలు

సోయా పంటకు నష్టాల మొలకలు!

వేసిన విత్తనం బాగా వచ్చిందని సంబరపడ్డ రైతుకు పంట చేతికొచ్చే క్రమంలో వరుసగా కురుస్తున్న వర్షాలు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన శివశంకర్‌ అనే యువరైతు తనకున్న 10 ఎకరాల్లో సోయా పంట వేశాడు. నెల కిందట అధిక వర్షాలతో పంట సరిగా రాక ఎకరా పంటను పూర్తిగా తొలగించాడు. మిగతా పంటకూ ఇపుడు మొలకలు రావడంతో రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. గతేడాది పత్తి, సోయా వేయగా వర్షాలతో సరైన దిగుబడి రాక అప్పులపాలయ్యాడు. ఈసారీ పంట కోసం రూ.1.40 లక్షలు ప్రైవేటు అప్పు చేశాడు. మరో రూ.40 వేలు బ్యాంకు రుణం తీసుకున్నాడు. దిగుబడి బాగుందనుకునేలోపే వర్షం దెబ్బకు కుదేలయ్యానని గొల్లుమంటున్నాడు.. జిల్లావ్యాప్తంగా 80వేల ఎకరాల్లో సోయా సాగు చేయగా.. సుమారు 20వేల ఎకరాల్లో ఇలా గింజలకు మొలకలు వచ్చాయి.  

- ఈనాడు, ఆదిలాబాద్‌; న్యూస్‌టుడే, సిరికొండ


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని