చాకలి ఐలమ్మకు గవర్నర్‌, అసెంబ్లీ స్పీకర్‌, మంత్రుల నివాళి

ప్రధానాంశాలు

చాకలి ఐలమ్మకు గవర్నర్‌, అసెంబ్లీ స్పీకర్‌, మంత్రుల నివాళి

ఈనాడు, హైదరాబాద్‌:  తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలు ఆదివారం రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్‌ తమిళిసై.. ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, పీయూసీ ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు. ఆమె దొరల అన్యాయాన్ని సహించలేక సమాజంలో అందరికీ సమాన గౌరవం లభించాలని దైర్యంగా ఎదురు నిలబడిన శక్తి అని సభాపతి పోచారం అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన తెలంగాణ మలివిడత ఉద్యమం కూడా ఐలమ్మ స్పూర్తితో జరిగిందన్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద ఐలమ్మ విగ్రహానికి మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని