ఎంపీ డి.శ్రీనివాస్‌ భుజానికి గాయం

ప్రధానాంశాలు

ఎంపీ డి.శ్రీనివాస్‌ భుజానికి గాయం

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ ఇంట్లో జారిపడ్డారు. దాంతో ఆయన భుజానికి గాయమైంది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో సోమవారం ఉదయం పూజ గది నుంచి బయటకు వస్తుండగా ఆయన కింద పడిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే తీసి భుజానికి ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించారు. నాలుగైదు రోజుల్లో శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకువచ్చామని డీఎస్‌ కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని