రాష్ట్రంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌; బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: రాజధాని హైదరాబాద్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. దుర్గాష్టమి రోజునే బతుకమ్మ ముగింపు వేడుకలు జరగాలనే నమ్మకంతో వివిధ జిల్లాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో ఉత్సవాలు జరిపారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉత్సవాలు జరిగాయి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో వేడుకలు జరిపారు. సికింద్రాబాద్‌ పరిధి రాణిగంజ్‌ కర్బలా మైదానంలో సంబురాలు అట్టహాసంగా సాగాయి. ప్రగతిభవన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సీఎం సతీమణి శోభ, కోడలు శైలిమలు.. తమ బంధువులు, ప్రగతిభవన్‌ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరగాలని భావిస్తున్న వారు గురువారం ఉత్సవాలను జరుపనున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ ఆడబిడ్డలు ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ సంబురాలు జరుపుకొంటున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


బతుకమ్మ వేడుకలకు వైఎస్‌ షర్మిల

బుధవారం రాత్రి హిమాయత్‌సాగర్‌ జలాశయం ఒడ్డున నిర్వహించిన వేడుకల్లో వైతెపా వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని