రెండు ప్రత్యేక రైళ్లు

ప్రధానాంశాలు

రెండు ప్రత్యేక రైళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌-అగర్తలా, సికింద్రాబాద్‌-రామేశ్వరం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 18న సాయంత్రం 4.35కి రైలు ప్రారంభమై 21న తెల్లవారుజామున 3 గంటలకు అగర్తల చేరుకుంటుంది. అదే రోజు 6.10గంటలకు బయలుదేరి 23 మధ్యాహ్నం 2.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ నెల 19, 26, నవంబరు 2, 9, 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 9.25కి సికింద్రాబాద్‌ నుంచి రామేశ్వరం రైలు బయలుదేరుతుంది. ఈ నెల 21, 28, నవంబరు 4, 11, 18, 25, డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు రైలు రామేశ్వరం నుంచి బయలుదేరి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని