వరవరరావు బెయిల్‌ గడువు పొడిగింపు

ప్రధానాంశాలు

వరవరరావు బెయిల్‌ గడువు పొడిగింపు

ఈ నెల 28 వరకూ లొంగిపోవాల్సిన అవసరం లేదు: బాంబే హైకోర్టు

ముంబయి: ఎల్గార్‌ పరిషద్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావు(82) మధ్యంతర బెయిల్‌ గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. ఈ నెల 28 వరకూ ఆయన తలోజా కారాగార అధికారుల ఎదుట లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. మావోయిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావుకు... అనారోగ్య కారణాల రీత్యా ఈ ఏడాది ఫిబ్రవరి 22న న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దాని ప్రకారం సెప్టెంబరు 5న ఆయన తిరిగి జ్యుడీషియల్‌ కస్టడీకి వెళ్లాలి. ఈ నేపథ్యంలో బెయిలు పొడిగించాలంటూ గత నెలలోనే వరవరరావు న్యాయవాదులు ఆర్‌.సత్యనారాయణ, ఆనంద్‌ గ్రోవర్‌లు హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిలో ఉంటూ వైద్యం పొందడం ఆర్థికంగా భారమవుతోందని, ఆయన్ను హైదరాబాద్‌కు తరలించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. వరవరరావు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, కంటి సమస్యలు, పార్కిన్సన్‌ లక్షణాలు, మెదడులోని ఆరు ప్రధాన లోబ్‌లకు చెందిన  సమస్యలతో బాధపడుతున్నట్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇంతకుముందు గడువు పొడిగించిన జస్టిస్‌ నితిన్‌ జమ్దార్‌, జస్టిస్‌ ఎస్‌.వి.కొత్వాల్‌ల ధర్మాసనం... గురువారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణను 26కు వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని