22లోపు అర్హత ధ్రువపత్రాల సమర్పణ

ప్రధానాంశాలు

22లోపు అర్హత ధ్రువపత్రాల సమర్పణ

విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి భారత్‌లో వైద్య వృత్తిని కానీ, ఉన్నత వైద్య విద్యాభ్యాసాన్ని కానీ కొనసాగించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా అర్హత పరీక్ష ఉత్తీర్ణత కావాలి. ఈ పరీక్షను డిసెంబరు 12న నిర్వహిస్తున్నారు. దీనికి హాజరు కావాలంటే ముందుగా ఈ నెల 22లోపు తమ విద్యార్హతకు సంబంధించిన అన్ని రకాల ధ్రువపత్రాలను జాతీయ వైద్య కమిషన్‌కు సమర్పించాలి. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అర్హత ధ్రువపత్రాలను నిర్దేశిత గడువు తేదీ లోపు సమర్పించిన అభ్యర్థులకే పరీక్ష రాసే అవకాశం ఉంటుందని జాతీయ వైద్య కమిషన్‌ స్పష్టం చేసింది. అసంపూర్తి సమాచారంతో పంపించే దరఖాస్తులు పరిశీలనకు నోచుకోవని పేర్కొంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని