కరెంటు కోతల్లేకుండా చర్యలు తీసుకోండి

ప్రధానాంశాలు

కరెంటు కోతల్లేకుండా చర్యలు తీసుకోండి

కృష్ణపట్నం, వీటీపీఎస్‌ కొత్త యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించండి: ఏపీ సీఎం ఆదేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల్లోని కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించి 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగ పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లోని బొగ్గు నిల్వలు, విద్యుదుత్పత్తి పరిస్థితిని అధికారులు వివరించారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని