17న అలయ్‌-బలయ్‌కు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

ప్రధానాంశాలు

17న అలయ్‌-బలయ్‌కు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

విశిష్ట అతిథులుగా తెలంగాణ, ఏపీ, హరియాణా సీఎంలు 

అమీర్‌పేట, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ నెల 17న హైదరాబాద్‌లోని జలవిహార్‌లో అలయ్‌-బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె, కార్యక్రమ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆహ్వాన కమిటీ సభ్యులతో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు. తన తండ్రి దత్తాత్రేయ ఏటా దసరా మరుసటిరోజున పెద్ద ఎత్తున అలయ్‌-బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, కుల, మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా 16 ఏళ్లుగా దీన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని విజయలక్ష్మి తెలిపారు. 17న నిర్వహించే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్లతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, హరియాణా ముఖ్యమంత్రులు విశిష్ట అతిథులుగా పాల్గొంటారని వివరించారు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని