శ్రీచైతన్య ప్రచారకర్తగా రోహిత్‌ శర్మ

ప్రధానాంశాలు

శ్రీచైతన్య ప్రచారకర్తగా రోహిత్‌ శర్మ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ విద్యాసంస్థ శ్రీచైతన్య ‘ఇన్ఫినిటీ లెర్న్‌’కు క్రికెటర్‌ రోహిత్‌ శర్మ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ సందర్భంగా ఇన్ఫినిటీ లెర్న్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన మాట్లాడుతూ.. తమ సంస్థకు ప్రచారకర్తగా రోహిత్‌ శర్మ సరైన వ్యక్తి అన్నారు. కెరీర్‌పరంగా ఆయనకున్న ముందుచూపు, నేర్చుకోవాలన్న తపన, జట్టును విజయవంతంగా నడిపించగల సారథ్య లక్షణాలు శ్రీచైతన్య విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనుకుంటున్న ‘ఇన్ఫినిటీ లెర్న్‌’ లక్ష్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఈసందర్భంగా రోహిత్‌శర్మ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్న ఈ సంస్థలో మెరుగైన విద్యనందించడానికి, మెలకువలు నేర్పడానికి పారిశ్రామిక నిపుణులు, ఐఐటీ, బిజినెస్‌ స్కూళ్ల ప్రొఫెసర్లు పనిచేస్తుండడం విద్యారంగంలో గొప్పపరిణామమని రోహిత్‌శర్మ అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని