విశాఖ తీరంలో మలబార్‌ నౌకావిన్యాసాలు

ప్రధానాంశాలు

విశాఖ తీరంలో మలబార్‌ నౌకావిన్యాసాలు

బంగాళాఖాతంలో అమెరికా నౌకాదళం గురువారం నిర్వహించిన యుద్ధవిన్యాసాలు అబ్బురపరిచాయి. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు విశాఖ తీరానికి సమీపంలో మలబార్‌ రెండోదశ విన్యాసాల్లో భాగంగా ఈ నెల 11 నుంచి పలు యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అమెరికాకు చెందిన విమాన వాహక యుద్ధనౌక యు.ఎస్‌.ఎస్‌.కార్ల్‌విన్సన్‌ (సి.వి.ఎన్‌.-70) ఇందులో ప్రధానాకర్షణగా నిలిచింది. చైనా ఆధిపత్యాన్ని ఆపడమే లక్ష్యంగా పెద్దఎత్తున జరుగుతున్న మలబార్‌ విన్యాసాల్లో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, అమెరికా నౌకాదళ ఆపరేషన్స్‌ విభాగం అధిపతి మైక్‌ గిల్డే, తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ ఏబీ సింగ్‌ తదితర అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

-ఈనాడు, విశాఖపట్నం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని