టీవీల్లో చూసి తెలుసుకున్నాం: కల్యాణ్‌రావు

ప్రధానాంశాలు

టీవీల్లో చూసి తెలుసుకున్నాం: కల్యాణ్‌రావు

ఒంగోలు నేరవిభాగం, టంగుటూరు, న్యూస్‌టుడే: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతికి సంబంధించి ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేదని, టీవీల్లో ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ చేసిన ప్రకటన చూసి తెలుసుకున్నామని ఆయన తోడల్లుడు, విరసం నాయకుడు జి.కల్యాణ్‌రావు తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్కేకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఆర్కే మృతివార్తతో ఆలకూరపాడులోని ఆయన భార్య శిరీష ఇంటివద్ద విషాదం నెలకొంది. మీడియాతో మాట్లాడేందుకు వారు ఆసక్తి చూపలేదు. కొద్దిసేపటి తర్వాత కల్యాణ్‌రావు వచ్చి మాట్లాడారు. శిరీష మూడు నెలల క్రితం ఆర్కేను కలిసి వచ్చినట్లు సమాచారం.


మాకు సమాచారం లేదు

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి చెందినట్లు తమకు కచ్చితమైన సమాచారం లేదని పౌరహక్కుల నేత, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలిపారు.తొందరపడి ఏమీ స్పందించలేనని ఆయన పేర్కొన్నారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని