బాధితురాలికి మంత్రి కేటీఆర్‌ చేయూత

ప్రధానాంశాలు

బాధితురాలికి మంత్రి కేటీఆర్‌ చేయూత

వైద్య చికిత్సకు సొంతంగా రూ.10 లక్షల సాయం

‘ఈనాడు’ కథనానికి స్పందన

సదాశివనగర్‌, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక వైద్య చికిత్సకు మంత్రి కేటీఆర్‌ చేయూతనందించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన అఖిల(16) క్లైవల్‌ కార్డోమాతో బాధపడుతోంది. కుడి కన్నులో కదలికలు లేకపోవడంతో హైదరాబాద్‌లో చేసిన రెండు శస్త్రచికిత్సలు విఫలమయ్యాయి. చెన్నై వైద్యులను సంప్రదించగా ప్రొటాన్‌ బిన్‌ రేడియేషన్‌ థెరపీ చేయాలని, రూ.35 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. బాధితురాలి దీన స్థితిపై ఆగస్టు 17న ‘పేదింటి బిడ్డకు... పెద్ద కష్టం’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురించిన కథనానికి స్పందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్‌ సొంతంగా రూ.10 లక్షల చెక్కును పంపించారు. గురువారం నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సురేందర్‌ బాలికకు ఆ చెక్కును అందించారు.


ఎమ్మెల్సీ కవితకు ఏఆర్‌ రెహమాన్‌ కృతజ్ఞతలు

ఈనాడు, హైదరాబాద్‌: బతుకమ్మ పాట రూపకల్పనలో భాగస్వామిని చేసినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ గురువారం ట్విటర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కవిత స్పందిస్తూ.. తెలంగాణ సంప్రదాయాన్ని చాటేలా బతుకమ్మ పాటను అద్భుతంగా రూపొందించారని కొనియాడారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని