జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నారాయణ విజయం

ప్రధానాంశాలు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నారాయణ విజయం

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2021 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తాచాటారని ఆ విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఓపెన్‌ కేటగిరీలో 1, 4, 5, 9వంటి అత్యుత్తమ ర్యాంకులతో పాటు టాప్‌ 100లోపు 25 ర్యాంకులను సొంతం చేసుకున్నారని తెలిపారు. అన్ని కేటగిరీల్లో టాప్‌ 10లోపు 14మంది, టాప్‌ 100లోపు 98మంది, వెయ్యిలోపు 503మంది ర్యాంకులు  సాధించారని పేర్కొన్నారు.


శ్రీచైతన్య జయకేతనం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు రికార్డు సృష్టించారని ఆ విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో 1, 8, 10, 11 ర్యాంకులతో పాటు టాప్‌ 100లోపు 26మంది..వెయ్యిలోపు 124 మంది ర్యాంకులు సాధించారని వెల్లడించారు. అన్ని కేటగిరీల్లో టాప్‌ 10లోపు 9మంది, 100లోపు 93మంది, వెయ్యిలోపు 436మంది ర్యాంకులు సొంతంచేసుకున్నారని వెల్లడించారు. ర్యాంకర్లను శ్రీచైతన్య అధినేత బి.ఎస్‌.రావు అభినందించారు.


డా.కేకేఆర్‌ గౌతమ్‌ విద్యార్థుల ప్రతిభ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో డాక్టర్‌ కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ 100లోపు ఏడుగురు ర్యాంకులు సాధించారని తెలిపింది. అన్ని కేటగిరీల్లో కలిపి టాప్‌ 100లోపు 22మంది సొంతం చేసుకున్నారని పేర్కొంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసింది.


విశ్వభారతి పూర్వ విద్యార్థికి 5వ ర్యాంకు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో గుడివాడ విశ్వభారతి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ పూర్వ విద్యార్థి పి.లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి అఖిల భారత స్థాయిలో 5వ ర్యాంకును సాధించినట్లు ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ పొట్లూరి శ్రీమన్నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో 2, 5, 17, 39, 42, 54, 57, 59, 61, 72, 86 వంటి ఉత్తమ ర్యాంకులతో పాటు 500లోపు 32 ఆలిండియా ర్యాంకులతో విశ్వభారతి పూర్వ విద్యార్థులు సత్తాచాటారని పేర్కొన్నారు.


ఎస్‌.ఆర్‌.ఎడ్యుకేషనల్‌ అకాడమీ సత్తా

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఎస్‌.ఆర్‌. విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో 1, 79, 178, 399వ ర్యాంకులతో సత్తాచాటారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ ఎ.వరదారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటితో పాటు అన్ని కేటగిరీల్లో కలిపి 403, 406, 727, 795, 808, 842, 933, 941, 988, 993 తదితర ర్యాంకులనూ సాధించారని తెలిపారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని