ఏపీపీ పరీక్షలకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ ద్వారా తీసుకోవచ్చు

ప్రధానాంశాలు

ఏపీపీ పరీక్షలకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ ద్వారా తీసుకోవచ్చు

పోలీసు నియామక మండలి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 151 పోస్టులకు ఈనెల 24న జరుగుతున్న ఈ పరీక్షకు ఈనెల 18న ఉదయం 8 నుంచి 23వ తేదీ అర్థరాత్రి వరకూ ‌www.tsl prb.in  వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. కాగితానికి రెండువైపులా ప్రింటు తీసుకోవచ్చని, ప్రతి అభ్యర్థి నిర్దేశిత ప్రదేశంలో తన పాస్‌పోర్టు ఫొటో అంటించాలన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే support@tslprb.in కి మెయిల్‌ చేయవచ్చన్నారు.. 9393711110, 9391005006 నంబర్ల ద్వారానూ సాయం పొందవచ్చని సూచించారు. అభ్యర్థులకు మండలి ద్వారా హాల్‌టికెట్లు పంపడం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని