సాగర్‌లో 6 గేట్ల ద్వారా నీటి విడుదల

ప్రధానాంశాలు

సాగర్‌లో 6 గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ జలాశయానికి శనివారం రాత్రి 7 గంటల సమయానికి శ్రీశైలం నుంచి 69,313 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్‌ 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 48,474 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలు, ప్రధాన విద్యుత్కేంద్రం, ఎస్‌ఎల్బీసీతో కలిపి మొత్తం 96,980 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీటిమట్టం 589.80 అడుగులు (గరిష్ఠ స్థాయి 590.00 అడుగులు) నమోదైంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని