18న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ప్రమాణం

ప్రధానాంశాలు

18న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ప్రమాణం

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ఈ నెల 18న ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర.. హైకోర్టులో సోమవారం ఉదయం 10.30గంటలకు జస్టిస్‌ తిల్హరీతో ప్రమాణం చేయించనున్నారు. అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ 1969 ఫిబ్రవరి 9న జన్మించారు. 2019 డిసెంబరు 12న అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని