ప్రగతిభవన్‌లో సీఎం దసరా పూజలు

ప్రధానాంశాలు

ప్రగతిభవన్‌లో సీఎం దసరా పూజలు

విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా వాహన పూజ, అయధ పూజలు జరిపారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ చేశారు. సీఎం సతీమణి శోభ,  మంత్రి కేటీ రామారావు, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, తెరాస ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని