వైభవంగా చక్రస్నానం

ప్రధానాంశాలు

వైభవంగా చక్రస్నానం

పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు.  ఇందులో భాగంగా ఉదయం ఆలయంలోని ఐనామహల్‌ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఐనామహల్‌ ముఖమండప ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్నపుష్కరిణిలో ఉదయం 10 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణిలో ముంచి స్నానాదులు చేయించారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ  చక్రస్నాన ఘట్టాన్ని తిలకించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లి తదితరులు సీజేఐ వెంట ఉన్నారు. అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్శించుకున్నారు.

ధ్వజావరోహణంతో పరిసమాప్తం

తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. రాత్రి 7గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 నుంచి 9గంటల మధ్యలో గరుడ పతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాలను ముగించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని