బాటసింగారంలో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ ప్రారంభం

ప్రధానాంశాలు

బాటసింగారంలో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ ప్రారంభం

అబ్దుల్లాపూర్‌మెట్‌, తుర్కయాంజాల్‌, న్యూస్‌టుడే: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలోని లాజిస్టిక్‌ పార్కులో శుక్రవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి కోహెడలో శాశ్వత పండ్ల మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని గతంలోనే సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ పాల్గొన్నారు. భవిష్యత్తులో ఉస్మాన్‌గంజ్‌, మహబూబ్‌గంజ్‌ మార్కెట్‌లు సైతం కోహెడకు తరలివస్తాయని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ స్థలంలో రూ.1200 కోట్లతో 2 వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం సంకల్పించారని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వివరించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని