‘టైప్‌ రైటింగు పరీక్షల రుసుం తగ్గించండి’

ప్రధానాంశాలు

‘టైప్‌ రైటింగు పరీక్షల రుసుం తగ్గించండి’

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో టైప్‌ రైటింగు పరీక్షల రుసుం తగ్గించాలని రాష్ట్ర టైప్‌ రైటింగు శిక్షణ సంస్థల (ఇన్‌స్టిట్యూట్స్‌) సంఘం అభ్యర్థించింది. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘం గౌరవాధ్యక్షుడు, తెరాస మల్కాజిగిరి పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి కార్యాలయంలో సమావేశం జరిగింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాస్‌, సతీష్‌బాబు ఇతర నేతలు పాల్గొన్నారు. పరీక్షల రుసుం రూ.350 నుంచి రూ.1,250కి పెంచడం ద్వారా పేద విద్యార్థులకు భారమవుతుందని, తగ్గించాలని తీర్మానించారు. సాదాసీదా సంస్థల్లో గాకుండా ప్రభుత్వ గుర్తింపు గల సంస్థల్లోనే పరీక్షలు నిర్వహించాలని కోరారు. సమస్యలను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రాజశేఖర్‌రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని